suhas

Prasanna Vadanam: సక్సెస్​ సుహాస్​ సొంతం..ప్రసన్న వదనం హాట్రిక్​

Prasanna Vadanam: సక్సెస్​ సుహాస్​ సొంతం..ప్రసన్న వదనం హాట్రిక్​

Suhas : షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్. ఇటీవలే ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ ప్రసన్న వదనం సినిమా హిట్ తో మరో హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు.

Prasanna Vadanam: 'ప్రసన్న వదనం'లాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇందులో చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: 

బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో సుహాస్(Suhas) నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం(Prasanna Vadanam 3 Days Collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా మరోసారి సుహాస్​ రికార్డులు బ్రేక్​ చేశాడని చెప్పొచ్చు.


యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు.

ColorPhoto:- కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు సహా నిర్మాతగా చేశాను. ఓ స్నేహితుడి ద్వారా ప్రసన్న వదనం కథ నా దగ్గరకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు అర్జున్, సుకుమార్ గారి దగ్గర పని చేశారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా తీశారు. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో లాభాల్లో సైతం సక్సెస్​లోనే ఉన్నారు. మైత్రీ, హోంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేశారు.  


Comment As:

Comment (0)