Telugu Fast News
Telugu Fast News
Saturday, 20 Apr 2024 18:30 pm
Telugu Fast News

Telugu Fast News

Cherlapally Central Jail:హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్​ జైలులో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకులనే మింగేశాడు. అతడు తీవ్ర కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న క్రమంలో జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులో అడ్మిట్​ చేశారు.  వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీశారు.

జైలు వైద్యుల సూచనతో 4 రోజుల క్రితం అతడిని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) లోని జైలు వార్డులో చేర్పించారు. అయితే అతడి కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చివరకి చికిత్స చేసి వాటిని బయటకి తీశారు. అయితే తాను 16 మేకులను పలు ధపాలుగా మింగానని వైద్యులకు మహ్మద్ షేక్ చెప్పాడు. అతడి కడుపులో తొమ్మిది మేకులు మాత్రమే ఉన్నాయని.. మిగిలినవి మలద్వారం నుంచి బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Prisoner : హైదరాబాద్‌(Hyderabad) లోని చర్లపల్లి జైలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకు(Iron Nails) లనే మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పి(Stomach Pain) తో బాధపడుతున్న అతడు ప్రాణాపాయ స్థితిలో 4 రోజుల క్రితమే సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌(ఖైదీలు) వార్డులో చేరాడు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీసేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి జైలులో మహ్మద్ షేక్ (32) అనే వ్యక్తి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. 


మహ్మద్ షేక్‌కు అసలు మేకులు ఎక్కడ దొరికాయి. వాటిని ఎందుకు మింగాడు అనే విషయాలపై ఇంకా స్పష్టతం రాలేదు. ప్రస్తుతం వీటిపై జైలు అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోగి ప్రాణాలు కాపాడిన.. గాంధీ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు, పీజీలు, సిబ్బంది పనితీరుపై వైద్య ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.

అబ్బే మా ఖైదీ కాదు.. చర్లపల్లి సెంట్రల్​ అధికారులు మాత్రం మేకులు మింగిన ఖైదీకి మాజైలుకు ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. సంగారెడ్డి జిల్లా జైలు నేరుగా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్​ అయ్యాడని ప్రకటించారు. కానీ ఈఘటనకు ముందు నెలకి రెండుసార్లు చర్లపల్లి జైలులో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఖైదీలు కోర్టులకు వెళ్లినప్పుడు న్యాయమూర్తిలకి పిర్యాదు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.