Telugu Fast News
Telugu Fast News
Wednesday, 24 Apr 2024 00:00 am
Telugu Fast News

Telugu Fast News

Telugu Fast News: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రోజుకో కొత్త పేరు వస్తోంది. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ తరఫున రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నామినేషన్ వేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Khammam Loksabha:ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం నేతలు తెరపైకి రోజురోజుకు కొత్త పేర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ తరఫున రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నామినేషన్ వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ కోసం మంత్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లు నందిని టికెట్‌ కోసం భట్టి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేరళ వెళ్లి కేసీ వేణుగోపాల్‌ను భట్టి కలిశారు. మరో 24 గంటల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. 

మరికొన్ని గంటల్లోనే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలనుంది. ఇదిలాఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈరోజు నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇదిలాఉండగా ఏప్రిల్ 19 నుంచి మొదలైన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో జూన్ 1 వరకు జరగనున్నాయి. మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.