
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బెయిల్ పిటిషన్(Bail Petition)పై ఇవాళ నాంపల్లి కోర్టు(Nampally Court)లో విచారణ జరగనుంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో తనకు రెగ్యులర్ బెయిల్(Regular Bail) ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీపై పోలీసులు నేడు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరిన నేపథ్యంలో విచారణను కోర్టుకు ఈరోజుకు వాయిదా పడింది.
ఇక సంధ్య థియేటర్(Sandya Theatre)లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బన్నీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్(Interim bail) ఇవ్వడంతో విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బన్నీ బెయిల్‌పై నేడు కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది.
బన్నీపై కేసు మొదలైందిలా..
కాగా డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో(Pushpa-2 Benefit Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. 2రోజులకు అల్లు అర్జున్‌ను A11గా చేర్చారు. దీంతో బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్‌ను 2వారాల పాటు రిమాండ్‌కు పంపింది. అయితే అప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేసిన అల్లు అర్జున్.. నాంపల్లి కోర్టు రిమాండ్ నేపథ్యంలో హైకోర్టును మధ్యంతర బెయిల్ కోరారు.