సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులకు అదిరిపోయే న్యూస్.. తమ ఫేవరేట్ హీరో సినిమాలు థియేటర్లలో చూడలేకపోతున్నమని ఫీలవుతున్న వారిని త్వరలోనే అలరించనున్నాడు. ఇంతకీ ఇప్పుడు మహేశ్ బాబు సినిమా ఏంటా అని ఆలోచిస్తున్నారా? అవునండీ మీరు చదివింది నిజమే. కాకపోతే అది కొత్త సినిమా కాదు. మహేశ్ బాబు-అమృతారావు జంటగా నటించిన ‘అతిథి(Athidhi)’ మూవీ వాలంటైన్స్ డే స్పెషల్‌(Valentine’s Day Special)గా ఫిబ్రవరి 14న రీ-రిలీజ్(Re Release) కానుంది. 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద అనుకున్న రేంజ్‌లో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ప్రిన్స్ యాక్టింగ్‌కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి(Director Surendar Reddy) డైరెక్ట్ చేశారు. ఆశిష్ విద్యార్థి, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం(Brahmanandam), నాజర్, రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao), అజయ్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మహేస్ స్టైలిష్ గెటప్, నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) సినిమా కోసం ప్రీపేర్ అవుతున్నాడు. గుంటూరు కారం సూపర్ హిట్ తర్వాత మహేశ్ తన మేకోవర్, లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు. ఆయన న్యూలుక్ ఫొటోలు సోషల్ మీడియా(SM)లో తెగ వైరలయ్యాయి. జక్కన్న-మహేష్ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR సినిమా కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించనున్నారని టాక్. దీంతో SSMB 29 ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది.