
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన వేళ మరోసారి క్యాబినెట్ విస్తరణ(Cabinet expansion) అంశం తెరమీదకు వచ్చింది. అయితే తాజాగా సమాచారం మేరకు రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం TPCC కార్యవర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. CM రేవంత్కూడా మీడియా చిట్‌చాట్(Media chitchat)లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) అయ్యాకే క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఆశావహుల జాబితా సిద్ధం?
ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ(Dipadas Munshi), TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చర్చలు జరుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల వారీగా ఆశావహుల జాబితాను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీలు ఢిల్లీ పర్యటనలో ఉండగా.. వారితో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. నేతలతో విడివిడిగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
నేను ఎవరి పేర్లు సిఫార్సు చేయలేదు: సీఎం
ఇక, ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. మంత్రివర్గం(Cabinet)లో ఎవరూ ఉండాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను ఎవరి పేర్లను సిఫారసు చేయడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వే(Census Survey) చేశామని సీఎం మరోసారి స్పష్టం చేశారు.