
విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా.. ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. ఈ సినిమా ఈ పొంగల్‌కి ఫ్యామిలీ ఎంటైర్‌టైనర్‌గా కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న రిలీజ్ కానుంది. ఆ మూవీలో వెంకీమామ వైఫ్‌గా ఒకప్పటి నటుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) నటిస్తోంది. తమిళ(Tamil) ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్(Tollywood) ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో గుర్తింపు పొందారు. తాజాగా వెంకీమామ సరసన ఛాన్స్ కొట్టేసిందీ ముద్దుగుమ్మ. తాజాగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రమోషన్ల(Promotions)లో ఈమె ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రమోషన్ ఈవెంట్లో తనకు ఎలా వెంకటేశ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందో తెలిపింది ఐశ్వర్య. తాను తమిళంలో వెబ్ సిరీస్(Web series)లో యాక్ట్ చేశానని, ఆ షూటింగ్లో ఉండగా అనిల్ రావిపూడి ఫోన్ చేసినట్లు వెల్లడించారు. తాను అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని మాట్లాడుతున్నాను అంటే తనకి ఆయన పేరు తెలియదని చెప్పుకొచ్చింది. ఆయన చేసిన సినిమాలు చూశాను కానీ ఆయన పేరు అనిల్ రావిపూడి అనే విషయం నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి మేము ఇలా ఒక సినిమా ప్లాన్ చేశాం.. మీరు దానికి లుక్ టెస్ట్, ఆడిషన్స్(Look test, auditions) చేయాలి అంటే మీరు నేను చేసిన తమిళ సినిమాలు చూశారా? దాదాపు 40 కి పైగా సినిమాలు చేశానని ఆయనతో అన్నాను.
దానికి ఆయన అలా కాదమ్మా మీరు మంచి నటి. ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ సినిమాల్లో లుక్ చాలా కీలకం కాబట్టి మీకు ఆ లుక్ సెట్ అవుతుందో లేదో ఒకసారి చూడాలనుకుంటున్నానని అన్నారు. వెంటనే నేను సరే వస్తానని చెప్పాను. తర్వాత ఆయన గురించి గూగుల్(Google) చేస్తే అయ్యో ఆయన పేరు తెలుసుకోలేకపోయానే అనే బాధ కలిగింది అని ఆమె చెప్పారు. అలా తనను ఆడిషన్ చేయమని అడిగితే తనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇలా సడన్‌గా తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry) నుంచి ఒక కాల్ వచ్చి ఆడిషన్ అడిగితే దానికి షాక్ అయ్యానని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.