
అక్కినేని కోడలు స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా శోభిత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
ఏఎన్నార్(ANR), ప్రధానమంత్రి మోదీ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘గౌరవనీయులైన మోదీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు మీ వంటి గొప్ప నాయకుడి నుండి పొందడం మా అదృష్టం. హృదయ పూర్వక ధన్యవాదములు’ అంటూ నమస్కారం చేస్తున్న ఎమోజీని జోడించింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు విషయాలు పంచుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజా ఏపిసోడ్‌లో ప్రధాని.. ఏఎన్నార్‌ని గుర్తు చేసుకుంటూ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘అక్కినేని.. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.