
మెగా ఫ్యాన్స్(Mega Fans) ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కన్నడ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ సరసన కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తుండగా.. అంజలి(Anjali), ఎస్‌జే సూర్య, శ్రీకాంత్(Srikanth) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్(Promotions)ను ఓ రేంజ్‌లో జరిగాయి. అందుకు తగ్గట్లే గేమ్ ఛేంజర్‌కి మంచి బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి(Sankranti) కానుకగా ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ మరో అప్డేట్ వదిలారు. ఇంతకీ అదేంటంటే..
చెర్రీ మూడు పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు(Songs) ‘జరగండి.. జరగండి, ధోప్, రా మచ్చా సాంగ్’ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీటికి మరో మెలోడీ సాంగ్(Melody Song) జతకలిసింది. ”అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓ దొర. చిలక ముక్కు చిన్ని నా దొరా”. అంటూ ఈ మెలోడీ ఉండగా.. రామ్ చరణ్-అంజలిపై ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్(Kasarla Shyam) లిరిక్స్ అందించారు. తమన్, S రోషిని JKV కలిసి పాడారు. తమన్(Taman) మ్యూజిక్ అందించాడు. ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. మరి ఇకెందుకు ఆలస్యం మీరూ వినేయండి..