
శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం కుర్రకారును తన అందం, డ్యాన్స్(Dance), నటనతో తెగ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్(Tollywood)లోకి వచ్చీరాగానే తన తొలిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. క్రేజీ హీరోయిన్(Crazy Heroine)గా పేరు తెచ్చుకొని అదే ఊపులో వరుస మూవీలను లైన్లో పెట్టింది. అయితే అందులో ఒక్కటి కూడా సరైన ట్రాక్ రికార్డును మాత్రం ఇవ్వలేకపోయిందనే చెప్పవచ్చు. ఇండస్ట్రీలో పోటీ ఎదుర్కోవడం, రోజురోజుకూ కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న నటీమణుల కారణంగా సరైన గుర్తింపు అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ అదే రేంజ్‌లో సినిమాలకు రెడీ అవుతున్న తరుణంలో ఓ ఆఫర్ శ్రీలీల నుంచి మరో హీరోయిన్‌కి వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా..
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్(Star Image)ను అందుకున్న శ్రీలీల.. సరైన హిట్ సినిమా లేకపోయినా స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశాన్ని మాత్రం అందుకుంది. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మూవీస్ చేసేసి మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు. ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్(Brand ambassador)గా వ్యవహరిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా తమిళ్‌లో కూడా అడుగు పెట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) కాంబినేషన్‌లో చేస్తున్న సాలిడ్ చిత్రం ‘పరాశక్తి(Parashakti)’తో తమిళ్ ఎంట్రీ ఇస్తుండగా సౌత్‌లో మంచి లైనప్‌తో శ్రీలీల మోస్ట్ వాంటెడ్‌గా మారింది.
అయితే తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీ అవుతున్న హీరోయిన్‌కు బాలీవుడ్ ఆఫర్స్(Bollywood offers) కూడా రావడం కామన్. శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని ఎప్పుడు నుంచో పలు కథనాలు ఉన్నాయి. కాగా ఆమె మొదటి సినిమా గత ఏడాదిలోనే బాలీవుడ్‌లో మొదలవ్వాల్సి ఉంది కానీ అది ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. బాలీవుడ్ స్టార్, దేవర(Devara) సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మూవీలో శ్రీలీల నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janvi Kapoor) చెల్లెలు ఖుషి కపూర్(Khushi Kapoor)కు ఈ అవకాశం వచ్చినట్లు సమాచారం. కాగా శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రవితేజ(Ravi Teja)తో ఓ సినిమా చేస్తోంది.