
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. వెంకీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా రూ.250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇది కదా కిక్కంటే
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’. సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలై రెండు వారాలు దాటినా ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ నడుస్తోంది. ఇక వెంకీ మామ క్రేజ్ అంటే ఇది అనేలా.. జనం ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్ల బాట పడుతున్నారు. మరోవైపు భీమవరంలో చిత్రబృందం నిర్వహించిన బ్లాక్ బస్టర్ సంబురం ఈవెంట్ కు కూడా భారీగా అభిమానులు హాజరయ్యారు.
హ్యాట్రిక్ కొట్టిన కాంబో
ఇక ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీలో బుల్లిరాజు పాత్ర చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈ మూవీతో వెంకటేశ్, అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో హ్యాట్రిక్ కొట్టింది.