మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి స్పెషల్‌‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 155 పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఏజ్ పెరిగినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోస్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే చిరు చివరగా నటించిన ‘భోళా శంకర్’(Bhola Shankar), ‘వాల్తేరు వీరయ్య’(Valtheru Veeraiah) మూవీలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర సక్సెస్ కాలేదు. దీంతో మరో బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishwambhara). తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

రిలీజ్ తేదీపై అభిమానుల ఆసక్తి

డైరెక్టర్ వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సినీయర్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha), యంగ్ బ్యూటీ అషిక రంగనాథ్(Ashika Ranganath) చిరుకు జోడీగా నటిస్తున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ ఏడాది అవుతున్నప్పటికీ పోస్టర్స్(Posters) మాత్రమే విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పరిశీలనలో రెండు తేదీలు

ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది. సంక్రాంతి(Sankranti)కి రావాల్సిన ఈ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer) కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో రెండు రిలీజ్ డేట్స్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి మే 9, 2025. సమ్మర్ హాలీడేస్‌లో బాస్ ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపబోతున్నాడని తెలుస్తోంది. మరొకటి చిరు బర్తే డే(Megasta Birthday) అయిన ఆగస్టు 22 అని కూడా ప్రచారంలో ఉంది.ఆ స్పెషల్ డేన ‘విశ్వంభర’ను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.