గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన కియారా అద్వానీ(
Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ అంజలీ(Anjali) కీలక పాత్ర పోషిస్తోంది. ఇక దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూస్తుండగా.. తమన్(Thaman) మ్యూజిక్ ఈ మూవీకి హైలైట్ నిలవనుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లను సైతం ఓ రేంజ్‌లో చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీలోని స్పెషల్ సాంగ్స్‌ బడ్జెట్‌(Budget)పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందేంటంటే..

ఇప్పుడు గేమ్ ఛేంజర్‌(Game Changer)లో 5 సాంగ్స్ ఉండగా.. వాటికి భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మూవీ మొత్తం రూ.350 కోట్లతో రూపొందగా.. సాంగ్స్‌కు ఊహించని రేంజ్‌లో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మగధీర(Magadheera) బడ్జెట్ కంటే ఇది ఎక్కువే అయినట్లు టీటౌన్ వర్గాల టాక్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన మగధీరలోని పాటలకు అప్పట్లో దాదాపు 40 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఇదే హయ్యెస్ట్. అందుకు తగ్గట్లే మగధీరకు మంచి లాభాలే వచ్చాయి.

అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్(Game Changer) సాంగ్స్ కోసం అంతకుమించి ఖర్చు చేయడం షాకింగ్. కేవలం సాంగ్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. దీంతో అంత ఖర్చు పెట్టారా? అని కొందరు నెటిజన్లు అంటుండగా.. శంకర్ కదా ఆ మాత్రం ఉండాలని మరికొందరు చెబుతున్నారు. ముఖ్యంగా ‘జరగండి.. జరగండి’ పాట కోసం అతి భారీ సెట్ వేసి సుమారు 600 మంది డ్యాన్సర్లతో సాంగ్ షూట్ చేశారట. ఆ తర్వాత వచ్చిన ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ కోసం 1,000 మంది జానపద కళాకారులతో సాంగ్ షూట్ చేశారట. మరి ఇంతమొత్తంలో ఖర్చుచేసిన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద ఏరేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొడుతుందో వేచిచూడాలి.