
అక్కినేని ఫ్యాన్స్ ఎన్నోరోజులుగా ఎదురుచూస్తోన్న ‘తండేల్(Thandel)’ మూవీ ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. చందూ మొడేటి(Director Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya)కు జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందించాడు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే థియేటర్లలోకి వచ్చిన ‘తండేల్’ మూవీపై అభిమానులు సోషల్ మీడియా(SM) వేదికగా తమ అభిప్రాయాలు, రివ్యూలను వెల్లడిస్తున్నారు.
☛ చైతూ-సాయిపల్లివి కాంబోలో మరో హిట్ ఖాయమంటూ కొందరు ట్వీట్(Tweet) చేస్తున్నారు. శ్రీకాకుళం యాసలో వీరి వాయిస్ ఓవర్ సూపర్‌గా ఉందని అంటున్నారు.
☛ తండేల్ సినిమా బాగుంది. మధ్యలో ఎమోషన్స్(Emotions)తో సాగదీశారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా అనిపించాడు. అతడు కెరీర్ బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు అని నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.
☛ తండేల్ సినిమా నాగచైతన్యకు కమ్ బ్యాక్ మూవీ. ఆ సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్, చూపించిన యాక్టింగ్ నిజంగా ప్రశంసనీయం. ఎప్పటిలానే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్(Dance performance)తో సాయిపల్లవి రాకింగ్.
☛ చందూ మొండేటి దర్శకత్వం, DSP మ్యూజిక్ హైలెట్. యదార్థ సంఘటనలతో తీసిన సినిమా థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి అని నెటిజన్ కామెంట్ చేశాడు.
☛ ఇంటర్వెల్ ట్విస్టు(Interval twist) ఈ సినిమాకు తోపులా అనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ఎపిసోడ్ ఉంటుంది. పాటలు చాలా బాగున్నాయి. సాయిపల్లవి యాక్టింగ్ మాత్రం సూపర్.
☛ తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియా(SM)లో పోస్టులు చేస్తున్నారు.
☛ దేశ భక్తి అంశాలు, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పాటలు(Songs) ఆకట్టుకున్నాయని కొందరు చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ చేస్తే బాగుండేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.
స్టోరీ ఏంటంటే..
శ్రీకాకులం(Srikakulam)లో తండేల్ రాజు(Thandel Raju) అనే మృత్సకారుడు. చేపల వేట కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా… పాకిస్థాన్(Pakistan) జలభాగంలోకి వెళ్తాడు. దీంతో అక్కడ పాక్ ఆర్మీ వాళ్లను అరెస్ట్ చేస్తుంది. దీంతో తండేల్ రాజును పాక్ ఆర్మీ నుంచి విడిపించుకోవడానికి ఆయన భార్య పోరాటం చేస్తుంది. చివరికి భారత ప్రభుత్వం సాయంతో తండేల్ రాజు పాక్ ఆర్మీ చెర నుంచి బయటికి వస్తాడు. ఇదే తండేల్ కథ.