
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)-కియారా అద్వానీ(Kiara Advani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Shankar) డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ఈ మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందుకు తోడు సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై నెగటివ్ రివ్యూలు, ట్రోల్స్ రావడం, విడుదలైన రోజే HD పైరసీ ప్రింట్ ఆన్లైన్లో దర్శనమివ్వడం వంటివి చెర్రీ మూవీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) దాదాపు రూ.450 కోట్లు వెచ్చించి మరీ తెరక్కించిన ఈ మూవీ అనుకున్న మేర కలెక్షన్స్(Collections) సాధించడంలోనూ నిరాశ పర్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ టీటౌన్లో చక్కర్లు కొడుతోంది.
ఒప్పందం ప్రకారం రిలీజైన 30 రోజుల తర్వాతే..
RRR వంటి పాన్ ఇండియా తర్వాత రామ్ చరణ్ సోలోగా చేసిన మూవీ గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 14 లేదా 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. అమెజాన్ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూవీ రిలీజైన 30 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. సో ఇప్పటికే ఈ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాను థియేటర్లలో మిస్సవుతున్నవారు, మరో సారి చూడాలనుకునే వారు ఎంచక్కా ఇంట్లోనే చూసేయవచ్చు.
పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఓ IAS సిన్సియర్‌గా విధులు నిర్వహిస్తే ఏం చేయగలడనే కథా నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించగా అన్ని పాటలు దాదాపు సూపర్ హిట్‌గా నిలిచాయి. అంజలి (Anjali), ఎస్జే సూర్య (SJ Suryah), జయరాం, శ్రీకాంత్, రాజీవ్ కనకాల వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.