
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). క్రిష్(Krish), జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతోంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం ఓ యోధుడుగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో పవర్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు.
ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా..
‘సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ సర్ ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్(Action) చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఆయన తన సన్నివేశం(Scenes)పై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి.’ అని చెప్పారు. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ(horse riding), క్లాసికల్ డ్యాన్స్(Classical dance)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పారు. కథక్ కూడా నెర్చుకున్నానని తెలిపింది నిధి. కాగా ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి రానుంది.
ఇదిలా ఉండగా ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా మేకర్స్ బిగ్ అప్‌డేట్(Update) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. ‘కొల్లగొట్టిందిరో(Kollagottinadhiro)’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.