మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప (Kannappa)’ సినిమా నుంచి ప్రతి సోమవారం ఓ అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఇవాళ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయన పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఫిబ్రవరి 4న ప్రభాస్ లుక్

ఫిబ్రవరి 3వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas Kannappa) లుక్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. పూర్తి లుక్ ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రివీల్ చేసిన లుక్ లో.. ప్రభాస్ గెటప్ చూస్తే పరమేశ్వరుడి లుక్ ను తలపిస్తోంది. ఇందులో త్రిశూలం కూడా ఉంది.

 

40 నిమిషాల పాటు ప్రభాస్ పాత్ర

ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీని గురించి క్లారిటీ రావాలంటే మరో వారం వేచి చూడాల్సిందే. అయితే దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని టాక్.  అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.