దేవీశ్రీ ప్రసాద్(Devi Sri Prasad).. మ్యూజిక్ రాక్ స్టార్. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో ఒకరిగా ఉన్నారు. జనతా గ్యారెజ్, జై లవకుశ, రంగస్థలం, భరత్ అనే నేను, మహర్షి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీలకు మ్యూజిక్ అందించగా.. దాదాపు సాంగ్స్ అన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటీవల Pushpa-2కి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చినా.. నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో దేవీలో మునుపటి స్పీడు, జోష్ తగ్గిందని వార్తలు వచ్చాయి. ఇందుకు కారణాలు ఏవైనా.. నిజం ఒప్పుకోవాల్సిందే. తాజాగా ‘తండేల్(Thandel)’తో పూర్తి స్థాయిలో దేవీశ్రీ ప్రసాద్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మూవీలో ఆయన మ్యూజిక్‌(Music)కు వంద మార్కులు వేశారు ఆడియన్స్.

విడుదలకు ముందే పాటలకు మంచి రెస్పాన్స్

ఫిబ్రవరి 7న విడుదలై ‘తండేల్’ మూవీ ఇప్పటికే పాజిటివ్ టాక్‌(Positive Talk)తో దూసుకుపోతోంది. ఈ మూవీకి వచ్చిన ప్రతి రివ్యూ, పబ్లిక్ టాక్‌లో అభిమానులు మ్యూజిక్‌కి 100 మార్కులు వేశారు. మూవీ రిలీజ్‌కు ముందే పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. పైగా అందరి దృష్టి నేపథ్య సంగీతం మీదే ఉంది. దానికి దేవి పూర్తి న్యాయం చేకూర్చడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

తండేల్‌లో ఫుల్ ఎఫర్ట్ పెట్టిన దేవీ

తండేల్‌(Thandel)లో దేవి పనితనం గురించి చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో రాజు వేట పూర్తి చేసుకుని తిరిగి వచ్చి సత్యని పరిగెత్తుకుంటూ లాక్ టవర్ పైకి తీసుకెళ్లి తన ప్రేమను ప్రదర్శిస్తాడు. చైతూ, సాయిపల్లవి పరుగుకు అనుగుణంగా వెనుక వినిపించే స్కోర్ వెంటాడేలా ఉంటుంది. రాజు విరహ వేదనతో బుజ్జితల్లి(Bujjithalli Song) పాడుకున్నప్పుడు, క్లైమాక్స్‌కు ముందు జరిగే ఫ్రెండ్ షిప్ ఎపిసోడ్‌లో దేవి పనితనం స్పష్టంగా కనిపించింది. దీంతో ఒకప్పుడు ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ టైంలో వినిపించిన వింటేజ్ దేవి ఇప్పుడు ‘తండేల్’లో వినిపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి DSP IS BACK అనేలా చేశాడు.