టాలీవుడ్ స్టార్ యాక్టర్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chinranjeevi), బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి(Vasishtha Mallidi) కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర(Vishwambhara). ఈ మూవీలో చిరుకు జోడీగా సీనియర్ నటి త్రిష(Trisha Krishnan) నటిస్తోంది. ఆషికా రంగనాథ్(Ashika Ranganath), రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ జపాన్‌లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో చిరు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ టాలీవుడ్‌(Tollywood)లో చక్కర్లు కొడుతోంది.

చిరు హీరోగా తెలుగు సోసియో,ఫాంటసీగా రూపొందుతోన్న ఈ మూవీని తొలుత 2025, జనవరి 10న విడుదల చేయాలని భావించారు. అయితే చిరు తనయుడు చెర్రీ కోసం మెగాస్టార్ వెనక్కి తగ్గారు. రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ మూవీకి లైన్ క్లియర్ చేశారు చిరు. దీంతో సంక్రాంతి(Sankranthi) బరి నుంచి తప్పుకున్న విశ్వంభర సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్ 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఓ న్యూస్ కూడా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ రెండోవారంలో ‘ది రాజాసాబ్‌(The Rajasaab)’ రిలీజ్‌ కానున్నట్లు గతంలోనే చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే.. ప్రభాస్‌ అనుబంధ సంస్థ UV క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘విశ్వంభర’కు పోటీగా, ప్రభాస్‌(Prabhas) మూవీ రావడం జరిగే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదిలావుండగా ఇటీవల చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం. ఏదేమైనా తనయుడి కోసం తండ్రి వెనక్కి తగ్గడం గొప్ప విషయమనే చెప్పాలి.