
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు నాలుగేళ్ల తర్వాత నటించిన ‘పుష్ప 2’ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే వసూళ్లలో ‘బాహుబలి 2’ రికార్డు కూడా బద్దలు కొట్టి రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ ఇండస్ట్రీ హిట్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ‘పుష్ప 2’ సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్‌ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈ మేరకు ‘‘సంక్రాంతి కానుకగా పుష్ప-2 రీలోడెడ్.. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా ఉండబోతోంది’’ అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రజెంట్ పుష్ప-2 రన్ టైం 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్ కాగా.. తాజాగా మరో 20 నిమిషాలు కలపనున్నారు. దీంతో మొత్తం 3.40 నిమిషాలకుపైగా నిడివి ఉండనుంది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 4 గంటలు అన్నమాట. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సమసిపోయినట్లేనా..
కాగా డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో బన్నీకి జంటగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించగా.. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను ఇవాళ అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి కలిశాడు. దీంతో ‘పుష్ప2’ వల్ల తలెత్తిన వివాదాలన్నీ సమసిపోయినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.