
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం చేపట్టిన సర్వేలో మల్లాపూర్ డివిజన్ గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ పాల్గొన్నారు. ప్రతి పేదింటి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు అందుతుందని భరోసా కల్పించారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ఆందోళన చెందకుండా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హలైన ప్రతి ఒక్కరికీ సిఎం రేవంతన్న సర్కారు న్యాయం చేస్తుందని అభయం ఇచ్చారు.