బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్‌ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్ కంటెస్టెంట్ RJ శేఖర్ బాషాపై నార్సింగి పోలీసుల(Narsingi Police)కు తాజాగా ఫిర్యాదు చేశారు. BNS 79, 67, IT చట్టం 72 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బాషా తన ఫోన్ కాల్ రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం కలిగేలా శేఖర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

శేఖర్‌పై లావణ్య వాదన ఇది

కాగా రాజ్‌ తరుణ్-లావణ్య(Raj Tarun-Lavanya) కేసులోనూ శేఖర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను తనను డ్రగ్స్‌(Drugs) కేసులో ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా(Mastansai, Shekhar Basha) యత్నించారని లావణ్య ఆరోపించింది. అంతే కాదు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా ఆడియోలను కూడా పోలీసులకు అందజేసింది లావణ్య. హీరో రాజ్‌తరుణ్ -లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది.