టాలీవుడ్‌(Tollywood)లో మరోసారి డ్రగ్స్ కేసు(Drugs Case) కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తీగ లాగితే డొంకంతా కదులుతోంది. హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు(Raj Tarun, Lavanya case)లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. తాజాగా లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయి(Masthan Sai)ని అరెస్ట్ చేయగా ఆయన వద్ద 300-400పైగా ప్రైవేట్ వీడియోల(Private Videos)ను పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రముఖులకు సంబంధించిన వీడియోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. మస్తాన్ సాయి తన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించడం ద్వారానే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ప్రముఖ నటుడు నిఖిల్(Nikhil) పార్టీ చేసుకుంటున్న ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

వాస్తవం ఏంటన్నది పోలీసులకూ తెలుసు: నిఖిల్

దీనిపై హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించాడు. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని అన్నాడు. కార్తికేయ-2 సక్సెస్ మీట్(Karthikeya-2 success meet) తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అవని, అక్కడ ఉన్నది కూడా తమ కుటుంబ సభ్యులే అని తెలిపాడు. ఇందులో వాస్తవం ఏంటనేది పోలీసులకు కూడా తెలుసు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్లో చాలా మంది అమ్మాయిలు వీడియోలతో పాటు పలువురి వ్యక్తుల ప్రైవేటు వీడియోలు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరో నిఖిల్ ప్రస్తావన రావడంతో చర్చనీయాంశమైంది. రోజుకో టర్న్ తీసుకుంటున్న ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.