యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సూపర్ హిట్ మూవీ తర్వాత చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా(Dilruba)’. డైరెక్టర్ విశ్వ కరుణ్(Director Vishwa Karun) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కిరణ్‌కు జోడీగా రుక్సర్ థిల్లాన్(Ruxer Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకోగా మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.

 టీజర్స్‌కు మంచి రెస్పాన్స్

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘క (KA)’ మూవీ సెన్సేషనల్ రెస్పాన్స్‌ను అందుకోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల్లో ‘దిల్ రూబా(Dilruba)’ మూవీపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా “మ్యాగీ మై ఫస్ట్ లవ్.. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలైనట్లు.. మ్యాగీతో లవ్‌లో ఫెయిలైయ్యాను’’ అంటూ దిల్ రూబాతో కిరణ్ టీజర్(Teaser) అదిరిపోయింది. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ పోస్టర్(Poster), టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘అగ్గిపుల్లే(Aggipulle)’ అనే పాటను రేపు (జనవరి 18) విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సామ్ CS సంగీతం(Music) అందిస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.