
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రియారెడ్డి(Shriya Reddy) కీలక రోల్ పోషిస్తోంది. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర(Kazuki Kitamura) కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ కీలక అనౌన్స్‌మెంట్ చేశారు. ఇంతకీ అదేంటంటే..
‘‘ OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓజీ మూవీని మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు (ఫ్యాన్స్) పవన్ కళ్యాణ్ పొలిటికల్ సభల(Political assemblies)కు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ, ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు’’ అని ట్వీట్ చేశారు.
ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం..
అంతేకాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025లో ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేం గట్టిగా నమ్ముతున్నామని DVV Entertainment ట్వీట్ చేసింది.