
హిందువులు(Hindus) ఎంతో పవిత్రంగా జరుపుకునే పర్వదినాల్లో రథసప్తమి(Rathasaptami) ఒకటి. దేశవ్యాప్తంగా రథసప్తమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారు. ముఖ్యంగా సూర్యుడి(Sun)కి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అంతే కాదు ఈరోజు నదీ స్నానం చేయడం ద్వారా మీరు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలను తొలగించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. ముల్లోకాల్లో ఉన్న దేవుళ్లలో మన కంటితో చూడగలిగేది సూర్యుడిని మాత్రమే. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. సూర్య ఆరాధనకు రథసప్తమి ప్రత్యేకంగా పూజ చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసం(Maghamasam)లో శుద్ధ సప్తమిని రథసప్తమిగా నిర్వహించుకుంటాం. ఇదే రోజు సూర్య భగవానుడు(Lord Surya) జన్మించాడని అంటారు.
ఏడు గుర్రాలతో కూడిన రథంపై సూర్యుడు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం(Uttarayanam)లోకి ప్రవేశిస్తాడు. రానున్న ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగానే చెప్పుకుంటారు. అందుకే ఈ రోజు సూర్యోదయం కన్నా ముందే గానే లేచి నది స్నానం చేసే సమయంలో సూర్యుడిని స్తుతిస్తూ జిల్లేడు ఆకులను తలపై ఉంచుకొని నీటిని తలపై పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు(Puranas) చెబుతున్నాయి. రథసప్తమి ఈ రోజే… అంటే ఫిబ్రవరి 4న ఉదయం 7:53 నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీనే రథ సప్తమిగా జరుపుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు పూజా సమయం ఉంటుంది.
రథసప్తమి రోజు మీకు కష్టాలు పోయి సుఖ సౌకర్యాలు పొందాలంటే కొన్ని రకాల దానాలు(Donations) చేయాలి. సూర్యుడికి ప్రత్యేకంగా పరమాన్నాం వండాలి. వాటిని చిక్కుడు ఆకులలో వేసి సూర్యుడికి నివేదించాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయను సమర్పించాలి. మంగళ హారతి పట్టాలి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఒక రాగి పాత్రలోనే నీటిని తీసుకోవాలి. అందులో తులసి ఆకుల(Tulasi leaves)ను వేయాలి. ఎరుపు రంగు పువ్వులను వేసి ఆ నీటిని ధారగా కిందకి వంపుతూ ఆ సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. 12 సార్లు సూర్య నమస్కారం చేయాలి. ధూపదీప దర్శనాలు చేయించి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. సూర్యుడు ప్రసన్నం చెందితే అష్టైశ్వర్యాలు మీకే చెందుతాయని పండితులు(Scholars) చెబుతున్నారు.