పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్-క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. అనివార్య కారణాలుగా చాలా రోజులుగా ఈ మూవీపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్(First Single) విడుదలైంది. ‘మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి’ అంటూ సాగే పాటను స్వయంగా పవన్ పాడటం విశేషం. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్‌పై AM రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. తొలి భాగం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు-1 ది స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు. మీరూ పవన్ సాంగ్‌ను వినేయండి