
నాలుగు రోజుల సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) సందడిగా ముగిశాయి. ముఖ్యంగా APలో కోడిపందేలు, ఎడ్లబండ్ల పోటీలతో జనం ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కోడిపందేలు పెద్దయెత్తున కొనసాగాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. మరోవైపు మందుబాబులు తగ్గేదేలేదన్నట్లుగా బాటిల్స్ ఖాళీ చేసేశారు. దీంతో పండగ మూడురోజుల్లో ఏపీలో దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం(Liquor) అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు(Excise Officers) తెలిపారు. సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో దాదాపు రూ.150 కోట్ల చొప్పున మద్యం అమ్మినట్లు తేలింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు రూ. 80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా రూ.160 కోట్లు అమ్ముడైందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్(Excise Department) పేర్కొంది.
ఏ సంక్రాతికి ఈ స్థాయి అమ్మకాలు కాలేదు: ఎక్సైజ్ వర్గాలు
ఇదిలా ఉండగా సంక్రాంతి(Sankranti) కోసం తెచ్చుకున్న సరుకు దాదాపుగా ఖాళీ అయిపోవడంతోనే షాపుల యజమానులు సైతం గురువారం భారీగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు చూస్తే 6,99,464 కేసుల లిక్కర్(Liquor), 2,29,878 కేసుల బీరు(Beer) అమ్ముడైంది. ఆరు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు సగటు కంటే లక్ష కేసులు, బీరు కూడా దాదాపు 30 వేల కేసులు పెరిగాయి. గతంలో ఎప్పుడూ సంక్రాంతికి ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని ఎక్సైజ్ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వం మార్పు, మద్యం ధరలు తగ్గింపు(Liquor prices reduced), నాణ్యమైన మద్యం సరఫరా లాంటి అంశాలు మద్యం అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.