
YSRCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పాలిటిక్స్(Politics)కు శుక్రవారం గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్(Tweet) చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వాని(Rajya Sabha Membership)కి రాజీనామా(Resignation) చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి తన ట్వీట్(X)లో తెలిపారు. CM చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తోనూ చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఇకపై పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని చెప్పడంతోపాటు అవసరమైతే వ్యవసాయం(Farming) చేసుకుంటానని విజయసాయి రెడ్డి తెలిపారు.
గతంలోనే రాజీనామా వార్తలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ(Political survival) కష్టమౌతుందని భావించిన ఈ సీనియర్ నేత ఇకపై రాజకీయాల్లో యోచనలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. YCP ఆవిర్భావానికి ముందు నుంచీ YS జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వస్తోన్న ఆయన ఎక్కువ కాలం కొనసాగదలచుకోలేదని, ప్రత్యామ్నాయ దారులను వెదుక్కుంటోన్నారనే వార్తలూ గతంలో అనేకం వచ్చాయి. కాగా విజయసాయి తాజా నిర్ణయంతో మాజీ సీఎం జగన్(YS Jagan), వైసీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది.