మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister MallaReddy)కి చెందిన ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్‌ హాస్టల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోని బాత్ రూములలో కెమెరాలు అమర్చి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ(CMR Engineering College)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

నిందితులు సుమారు 300కుపైగా వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు(Complaint of students) ఆధారంగా విచారణ చేపట్టి అనుమానితుల నుంచి సెల్ ఫోన్ల(Cell Phones)ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్, వారి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రహస్యంగా వీడియోలు తీస్తున్నది హాస్టల్‌(Hostel)లో వంట చేస్తున్న సిబ్బందేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారి నుంచి 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు సంఘటనపై కళాశాల యాజమాన్యం(College Management) తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు పట్టుబడుతున్నారు. మేనేజ్మెంట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పైగా ఈ వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాలని విద్యార్థినులు హెచ్చరించారు. కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.