తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Telugu Film Industry) 2024 సంవత్సరం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఏకంగా ఈ సారి చాలా సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేసి తమ సత్తాను నిరూపించుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసే వారికి గుణపాఠం చెప్పేలా సినిమాలు తీశారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం తెలుగు చిత్రాలు ఈజీగా రూ. 100 కోట్ల మార్కును దాటేస్తున్నాయి.

ఈ సంవత్సరంలో కల్కి 2898 ఏడీ (Kalki) చిత్రం దాదాపు 1110 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది. నిర్మాత అశ్వినీదత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరోగా ప్రభాస్ (Prabhas)కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఫస్ట్ డే దాదాపు రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’. ఓవరాల్ గా దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా.

టిల్లు తో ఫేమస్ అయిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్’. ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సరిపోదా శనివారం.. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా కూడా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదల అయిన పుష్ఫ 2 ( Pushfa2)మాత్రం ఇక అన్నింటికి మించి బాక్సాఫీసులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఏకంగా 1700 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నిర్మాతలు చెబుతున్నారు. బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేసేలా దూసుకుపోతుంది. నెక్ట్స్ దంగల్ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి.