పవర్ స్టార్(Power Star).. మెగా పవర్ స్టార్‌(Mega Power Star)ని ఓకే ఫ్రేమ్‌లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరికి మించి ఒకరు తమ వాక్చాతుర్యంతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అంతకిమించి ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని వేదిక మీదుగా చెబుతుంటే ఎలాంటి ఫీల్ వస్తుందో తెలుసా? చూడటానికి, వినడానికి రెండు కళ్లు, చెవులు సరిపోవు. సరిగ్గా ఇలాంటి మూమెంటే శనివారం రాత్రి అభిమానులకు దక్కింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో వస్తోన్న ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌(Pre Release Event) రాజమహేంద్రవరంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంటుకు పవర్ స్టార్, AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘మా అన్నయ్య చిరంజీవి(Chiranjeevi) షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్(Charan) గేమ్ చేంజర్ ట్రైలర్(Game Changer Trailer) చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఆస్కార్(Oscar) వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం. నా తమ్ముడులాంటి వాడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’’ అని అన్నారు.

అనంతరం మాట్లాడిన చెర్రీ(Cherry) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నమస్తే ఏపీ.. ‘‘సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి అభిమాని(Fans)కి పేరుపేరునా ధన్యవాదాలు. మన రాజమండ్రి బ్రిడ్జి మీద మన AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసంద్రం చూస్తే ఇలాగే ఉంది. తెరమీద బహుశా నేను చేసే పాత్ర ఒక గేమ్ ఛేంజింగ్ పాత్ర. కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు కేవలం APలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్‌(Indian Politics)కి ఏకైక గేమ్ ఛేంజర్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నిలబడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఆయనతోపాటు వచ్చిన మంత్రులు, MLAలు అందరికీ చాలా థాంక్స్’’ అని అన్నాడు.