
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Govt Employees)కు సెంట్రల్ గవర్నమెంట్(Central Govt) త్వరలోనే తీపికబురు చెప్పనుంది. ఎనిమిదవ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటు చేసేందుకు మోదీ(PM Modi) సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Employees), పెన్షన్‌దారుల (pensioners)కు భారీగా వేతనం(Salary Hike) పెరగనుంది. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు, పెన్షన్ దారులు వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి 7th పే కమిషన్ ముగియనుంది. ఈ నేపథ్యంలోని 8th Pay Commission 2025లో ప్రారంభమైతే 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. కాగా ఇది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఏఏ స్థాయి వారికి ఎంత మొత్తంలో వేతనం పెరనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఏ స్థాయి ఉద్యోగులకు ఎంత మొత్తంలో పెరుగుతుందంటే..
☛ ఇన్‌స్పెక్టర్లు(CI), సబ్ ఇన్‌స్పెక్టర్ల(SI)కు ప్రాథమిక వేతనం రూ. 35,400 నుంచి రూ. 1,01,244కి పెరగనుంది.
☛ సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజినీర్ల మూల వేతనం రూ. 44,900 నుంచి రూ.1,28,414కి పెరిగే అవకాశం ఉంటుంది.
☛ ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP), అకౌంట్స్ ఆఫీసర్లు ఉంటారు. వారి ప్రస్తుత మూల వేతనం రూ. 53,100 నుంచి రూ. 1,51,866కి పెరుగుతుంది.
☛ సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశ స్థాయి అధికారులతో సహా గ్రూప్ A అధికారులకు ప్రస్తుతం రూ.56,100గా ఉన్న బేసిక్ పే రూ.1,60,446కి పెరిగే అవకకాశం ఉంది.
☛ ప్యూన్లు, అటెండర్లకు గతంలో రూ.18,000గా ఉన్న బేసిక్ పే(Basic Pay) రూ.51,480కి పెరిగే అవకాశం ఉంటుంది.
☛ లోయర్ డివిజన్ క్లర్క్‌లకు బేసిక్ పే రూ.19,900 నుంచి రూ.56,914కి పెంచే అవకాశం ఉంది.
☛ పోలీసు సహా, కేంద్ర సర్వీసెస్‌లో కానిస్టేబుళ్లు, నైపుణ్యం కలిగిన సిబ్బందికి రూ.21,700గా ఉన్న బేసిక్ పే రూ.62,062కి పెరిగే అవకాశం ఉంది.
☛ గ్రేడ్ D స్టెనోగ్రాఫర్‌లు, జూనియర్ క్లర్క్‌ల ప్రాథమిక వేతనం, గతంలో రూ. 25,500 ఉండగా రూ.72,930కిపెరిగే అవకాశం ఉంది.
☛ సీనియర్ క్లర్క్, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బంది(Technical Staff)కి రూ.29,200 బేసిక్ వేతనం ఉండగా, అది రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది.