దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్​ వద్ద కాసుల పంట కురిపించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా టేకింగ్, ఇతర విషయాలపై ఈ డాక్యుమెంటరీలో జక్కన్న పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుతూ అది గ్రాఫిక్స్ కాదని.. రియల్ షాట్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ సినిమా ప్రారంభంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూ పోలీస్ స్టేషన్​పై దాడికి వచ్చిన చాలా మందిని రామ్ చరణ్ ఒక్కడే ఆపే సీన్ ఉంటుంది. ఈ సీన్ లో రామ్ స్టేషన్ పై దాడికి వచ్చిన వారందరిని చాకచక్యంగా ఆపుతాడు. ఈ క్రమంలో చెర్రీని చూసి భయపడి, ఆ జనసందోహం అంతా ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది. ఈ సీన్​ను చెర్రీ కంటి (RRR Eye Shot) లోపల నుంచి చూపించారు. ఈ సీన్ షూటింగ్ గురించి జక్కన్న వివరిస్తూ.. దీన్ని అందరూ గ్రాఫిక్స్  ద్వారా క్రియేట్ చేశారని అనుకున్నారని.. కానీ అది రియల్ షాట్ అని తెలిపారు. జక్కన్న తన టాలెంట్ ఉపయోగించి ఆ సీన్ రియల్​గానే షూట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్ (RRR : Behind And Beyond)’ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు.

‘ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ (RRR Documentary Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల మన్నన కూడా పొందుతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో చెర్రీ ఇంట్రో సీన్ లో కళ్ల షాట్ గురించి రాజమౌళి వివరించిన వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సన్నివేశంలో చెర్రీ కంటికి దగ్గరగా కెమెరా పెట్టి సీన్ ఎలా షూట్ చేశారో డాక్యుమెంటరీలో చూపించడం కనిపిస్తోంది.