
అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) పాకిస్థాన్ మెరుపు దాడులకు పాల్పడుతోంది. పాకిస్థాన్ (Pakistan) చేసిన వైమానిక దాడుల్లో మొత్తం 46 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని.. ప్రతీకారం తీర్చుకుంటామనిహెచ్చరించింది.
ఈ ఏడాది మార్చిలో కూడా..
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు (Taliban) ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశల మధ్య ఉన్న సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణల సమయంలో అనేక మంది తమ దేశస్తులను తాలిబన్లు చంపేశారని పాక్ ఆరోపించింది. ఇటీవల కూడా పాకిస్థాన్‌లో (Pakistan) జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసిన పాక్.. తాజాగా మరోసారి దాడులకు పాల్పడింది.
వదిలిపెట్టే ప్రసక్తే లేదు
అఫ్గాన్‌లోని తూర్పు పక్తికా ప్రావిన్స్ లో ఉన్న బార్మల్ జిల్లాలోని నాలుగు గ్రామాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది (Pakistan attack on Afghanistan). ఈ దాడుల్లో 46 మంది చనిపోయారని, మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి సీరియస్‌గా ఉందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ దాడులు ఓ అనాగరిక చర్య అని తాలిబన్ రక్షణశాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది.