
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నేడు ప్రత్యేకంగా సమావేశమవనుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్(Manmohan Singh) మృతికి సంతాపం తెలపడానికి సోమవారం స్పెషల్ సెషన్(Special Assembly Session) ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని సీఎం రేవంత్(Cm Revanth) నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత సభలో సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం(Resolution of condolence) ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాచారం అందించారు.
మన్మోహన్‌తో కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం
అయితే.. ఈ ప్రత్యేక సమావేశానికి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత KCR హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా మన్మోహన్ PMగా ఉన్నారు. పైగా ఆయనతో KCRకు ఎంతో అనుబంధం ఉంది. ఈ కారణంతో ఆయన శాసనసభ వేదికగా మన్మోహన్‌సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar), శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఫైనాన్స్ మినిస్టర్‌గా ఆర్థిక విప్లవం
కాగా మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26 రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ ఫైనాన్స్ మినిస్టర్(Finance Minister)గానూ దేశంలో ఆర్థిక విప్లవం సృష్టించారు. దివాలా తీసిన దేశాన్ని ప్రపంచంలోనే రెండో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కే దక్కుతుంది. పాత నోట్లలో మన్మోహన్ సంతకం కనిపిస్తుంది.