తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తొలుత ఆయన మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి రేవంత్‌కు అత్యవసర పిలుపుపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections), SC వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్(Budget) అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై కూడా సీఎం అధిష్ఠానం పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.

ఉదయం 11 గంటలకు సీఎల్పీ భేటీ

అంతకంటే ముందు నేడు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ సభాపక్ష సమావేశం(CLP) జరగనుంది. ఇటీవల MLAలు రహస్యంగా భేటీ కావడంతో కాంగ్రెస్‌(Congress)లో చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ(Deepas Munshi), పార్టీ MLAలు, MLCలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనుంది. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.