నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేశ్‌ (Venkatesh) కలిసి మరోసారి సందడి చేశారు. ఇందుకు బాలయ్య హోస్ట్​గా చేస్తున్న‘అన్‌స్టాపబుల్‌’ షోలో వేదికైంది. ఈ షో (Unstoppable) 4వ సీజన్‌ 7వ ఎపిసోడ్‌కు వెంకటేశ్‌ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మనం ఒకరికొకరు పోటీనా అని బాలయ్య సరదాగా అడగ్గా.. ఎక్కడమ్మా పోటీ అని వెంకీ అంతే సరదాగా సమాధానమిస్తాడు. తన మనసులో మహరాజు ఎప్పుడూ వెంకటేశ్‌ అని బాలకృష్ణ అన్నారు.

గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ ఉన్న ఫొటోను చూసి పాత రోజులు గుర్తొస్తున్నాయన్నాయని.. నలుగురం స్టూపర్‌ స్టార్స్‌ లాగా ఉన్నామా? అని వెంకీ అనగా.. కాదు నాలుగు స్తంభాల్లాంటి వాళ్లమని బాలయ్య అన్నారు. (Unstoppable with NBK S4) సరదాగా మాట్లాడుకున్నారు. తమ సినిమాల్లోని ఒకరి డైలాగులను మరొకరు చెప్పి ప్రేక్షకులను ఖుష్​ చేశారు. వెంకటేశ్​ నటించిన ప్రేమించుకుందా రా సినిమాలోని ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా’ పాటకు స్టెప్పులేశారు. చీఫ్​ గెస్ట్​గా వెంకటేశ్​ సోదరుడు, నిర్మాత సురేశ్​ హాజరయ్యారు. తన తండ్రి రామానాయుడిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఎపిసోడ్‌ చివర్లో అనిల్‌ రావిపూడి కనిపించి సందడి చేశారు.