రామ్ చరణ్-దిల్ రాజు(Ram Charan-Dil Raju) కాంబోలో ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘గేమ్ ఛేంజర్(Gam Changer)’. మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. పలువురు ఇతర హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు ఈ సినిమాపై సోషల్ మీడియా(Social Media)లో నెగిటివిటీ(
Negativity)ని బాగా స్ర్పెడ్ చేశారు. అలాగే విడుదలైన తెల్లారే HD పైరసీ ప్రింట్‌ను కూడా ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఈ మూవీని కొందరు అందులోని TVల్లో ప్రసారం చేశారు. దీంతో మూవీకి పెద్ద షాక్ తగిలింది. ఈ ఎఫెక్ట్ చెర్రీ మూవీ కలెక్షన్ల(Collections)పై విపరీతమైన ప్రభావం చూపించింది. అటు మూవీ టీమ్ సైతం పైరసీ(Piracy) ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫుల్ హ్యాపీగా ఊర్వశీ రౌతేలా

మరోవైపు ఈ సంక్రాంతికి బాలకృష్ణ(Balakrishna) నటించిన డాకు మహారాజ్(Daaku Mahaaraj) బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఓ పాత్ర చేసింది. అంతే కాకుండా బాలయ్యతో దబిడి దబిడి అంటూ స్పెషల్ సాంగ్‌కీ డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ పాట, సినిమా రెండూ హిట్ అవ్వడంతో ఊర్వశి ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో ఈ బాలీవుడ్ బ్యూటీ తెలిపింది.

యాక్టింగ్ స్కిల్స్ ఉంటే వరల్డ్ వైడ్‌గా గుర్తింపు

అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలాను సినిమా ఫలితాల గురించి పట్టించుకుంటారా? మీ సినిమాతో పాటు బాలీవుడ్ నటి కియారా అద్వానీ(Kiara Advani) ‘గేమ్ ఛేంజర్’ సినిమా కుడా విడుదలైంది కదా అని యాంకర్ అడిగారు. దీనికి ఊర్వశి రౌతేలా సమాధానమిస్తూ.. ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చే ట్యాగ్స్(Tags) ఉండాలి. అది కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తుంది. సినిమా పరిశ్రమలో మన యాక్టింగ్ స్కిల్స్‌కి వరల్డ్ వైడ్‌గా అభినందనలు వస్తాయి. నేను చాలా ట్వీట్స్ చదివాను. మా సినిమా మకర సంక్రాంతి ఫెస్టివల్ రోజు రిలీజయింది. అందరూ కియారా సినిమా డిజాస్టర్, ఊర్వశి సినిమా బ్లాక్‌బస్టర్(Blockbuster) అని అంటున్నారు అని తెలిపింది. దీంతో ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ ఊర్వశిని విమర్శిస్తున్నారు. కాగా చెర్రీతో కియారా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.