హీరోయిన్లతో తప్పుగా ప్రవర్తిస్తాడని తనపై వస్తున్న ఆరోపణలపై బాలీవుడ్​ హీరో వరుణ్​ ధావన్​ (Varun Dhawan) నోరు విప్పాడు. ఓ ఈవెంట్‌లో నటి అలియా భట్​ను (Alia Bhatt) అభ్యంతరకరంగా తాకడం, మరో షూటింగ్‌లో కియారా అడ్వాణీని అందరిలో ముద్దుపెట్టుకోవడంపై వరుణ్‌ ధావన్​ కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందించారు. తాను వారితో తప్పుగా ప్రవర్తించలేదని పేర్కొన్నాడు. కియారాతో కిస్​ ప్లాన్​లో భాగమేనని అన్నాడు.

ఈ విమర్శల గురించి విలేకరి ఇంటర్వ్యూలో ప్రశ్నించగా వరుణ్​ స్పందించాడు. ‘నేను షూటింగ్‌ సమయంలో నటీనటులందరితో ఒకేలా ఉంటాను. నా సహనటులతో ఎన్నోసార్లు సరదాగా ఇలా ప్రవర్తించాను. కానీ, ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. మీరు ఈ విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం వచ్చింది. నేను అందరిలో కియారాను (Kiara Advani) ఉద్దేశపూర్వకంగా ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో భాగంగా అలా చేశాం. ఆ క్లిప్‌ను నేను, కియారా ఇద్దరం సోషల్‌ మీడియాలో షేర్​ చేసుకున్నాం. ఇదంతా ప్లాన్‌ చేసి చేసిందే’ అని అన్నాడు.

ఇక అలియా భట్​తో మిస్​ బిహేవ్​ చేశాడంటూ వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. ‘ఆలియా నాకు మంచి ఫ్రెండ్​. ఆరోజు సరదాగా అలా చేశానంతే. కావాలని చేయలేదు. అది రొమాన్స్​ కాదు. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే’ అని వివరించాడు. వరుణ్​ ధావన్​ నటించిన ‘బేబీ జాన్​’ (Baby John) సినిమా ఈరోజే విడుదలైంది. తమిళంలో దళపతి విజయ్​, సమంతతో దర్శకుడు అట్లీ తెరకెక్కంచిన ‘తెరి’ సినిమాకు రిమేక్​ ఇది. ఇప్పుడు బాలీవుడ్​లో వరుణ్​, కీర్తి సురేశ్​, వామికా గబ్బీతో తీశాడు. తమన్​ మ్యూజిక్​ అందించాడు.