
పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయా(Politics)ల్లో ట్రెండ్ సెట్టర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టారు. అటు పాలిటికల్ లైఫ్, ఇటు సినీ కెరీర్(Film career)ను ఈక్వల్‌గా మేనేజ్ చేస్తూ ఎప్పుడూ ప్రజలకు చేరువలోనే ఉంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మరింత బిజీగా మారిపోయారు. వరుస రివ్యూలు, పర్యటనలతో నిత్యం ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. అలాగే తీరిక దొరికనప్పుడల్లా పెండింగ్ మూవీ(Pending Movies)లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వైద్యుల సూచన మేరకు రెస్ట్
పవన్ ప్రస్తుతం వైరల్ ఫీవర్(Viral Fever)తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ప్రకటించారు. వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్(Spondylitis) కూడా ఆయనను బాధపెడుతోందని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు. అస్వస్థత నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ సమావేశానికి(Cabinet meeting) పవన్ హాజరు కాలేకపోవచ్చని పేర్కొన్నారు.
ఆ మూవీ షూటింగ్‌కూ దూరం?
మరోవైపు పవన్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ చివరి షెడ్యూల్ బుధవారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో ఆయన ఈ షూటింగ్‌లోనూ పాల్గొనలేకపోవచ్చు. కాగా పవర్‌స్టార్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా(SM)లో పోస్టులు పెడుతున్నారు.