టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య  (Naga Chaitanya) మరోసారి స్టార్ హీరోయిన్ సమంతతో తన విడాకుల గురించి మాట్లాడారు. ‘తండేల్ (Thandel)’ మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న ఆయన ప్రమోషన్స్ లో భాగంగా ఓ తెలుగు పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు హోస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన విడాకుల గురించి చైతూ స్పందించారు. సమంతతో విడాకుల అంశం జనానికి ఓ వినోదంలా మారిందని అన్నారు.

మా విడాకులు వాళ్లకు వినోదం

“సమంత (Samantha)కు నాకు మధ్య ఉన్న రిలేషన్ చాలా గౌరవంగా ముగిసింది. మేం విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాం. మా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని అనుకున్నాం. మాకు ప్రైవసీ ఉంటుందని భావించాం. కానీ అది జరగలేదు. మా విడాకుల టాపిక్ అందరికీ ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు రాసుకున్నారు. దానిపై నేను స్పందిస్తే అందులో నుంచి మరిన్ని గాసిప్స్ పుట్టించారు.

మళ్లీ 100 స్టోరీలు పుట్టిస్తారు

సమంతతో విడాకుల (Samantha Divorce)పై నేను స్పందించిన ప్రతి సారి ఆ ఇంటర్వ్యూ నుంచి మళ్లీ కొన్ని ఆర్టికల్స్ పుట్టిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా.. ఇందులో నుంచి కూడా వంద స్టోరీలు పుట్టిస్తారు చూడండి. ఇప్పటికీ ఎవరో ఒకరు నన్ను అదే టాపిక్ పై గుచ్చి గుచ్చి అడుగుతుంటారు. దీనికి అంతేది. మేం విడిపోయాం. ఎవరి లైఫ్ వాళ్లం లీడ్ చేస్తున్నాం. తాను తన జీవితంలో ముందుకెళ్తోంది. నేను మరో ప్రేమ (Sobhita Dhulipala)ను పొందాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి.” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.

తండేల్ తో చైతూ హిట్

ఇక తండేల్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోంది. ఇందులో నాగచైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దేవీశ్రీప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్ని వాసు నిర్మించారు.