సూర్య తన అభిమానులకు క్రిస్మస్ కానుక ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ (Suriya 44 Update) ను క్రిస్మస్ రోజు (డిసెంబరు 25వతేదీ)న ప్రకటించనున్నారు. బుధవారం రోజున ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ లుక్ షేర్ చేశారు.
సముద్రతీరాన ఓ బెంచ్‌పై పూజా హెగ్డే (Pooja Hegde) కూర్చొని ఉండగా.. పక్కనే సముద్రంలోకి గులకరాళ్లు విసురుతూ సూర్య కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో శ్రియా శరణ్ (Shriya Saran) స్పెషల్ సాంగ్ ఉండనుందని మేకర్స్ తెలిపారు. గోవాలో ఈ పాట కోసం స్పెషల్ సెట్ వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ లవ్ స్టోరీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా సూర్య లిస్టులో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్ తో రోలెక్స్ మూవీ, సుధా కొంగరతో మరో చిత్రానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.