అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం(Gold) ధరపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు సామాన్యులు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల​ బంగారం ధర (Gold Price Today) రూ.87,650గా ఉండగా.. కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 20) కూడా బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి.

* 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.80,700 పలుకుతోంది.
* 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.390 పెరిగి రూ.88,040గా నమోదైంది.
* ఇక కేజీ సిల్వర్ రేటు రూ.100 తగ్గి రూ. 1,07,900 వద్ద కొనసాగుతోంది.

* ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర(Gold Rate) ఔన్సుకు 2870 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు(Silver Price) 32.29 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇండియన్ రూపాయి విలువ(Rupee Value) రికార్డ్ స్థాయిలో పతనమవుతూ ఆందోళన కలిగిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూ.87.10 వద్ద కొనసాగుతోంది.