తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) జాతర కొనసాగుతోంది. ప్రభుత్వం మీసేవ కేంద్రా(Mee Seva Centers)ల్లో అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడంతో అర్హులందరూ(All Eligible People) ఆ సెంటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో భారీగా అప్లికేషన్స్(Applications) వచ్చాయి. ఈ నెల 7నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల కమిషన్ జోక్యంతో మధ్యలో తాత్కాలికంగా వీటికి బ్రేక్ పడింది. అయితే మొత్తం ఆరు రోజుల్లో 1.01 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ మీసేవ కేంద్రాల్లో రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే జనం ఆయా సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు.

ఆ కారణంతోనే మళ్లీ అప్లికేషన్లు?

ఇదిలా ఉండగా ప్రజాపాలన సభలలో ఇప్పటి వరకు 40 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎవరైతే ప్రజాపాలన(Praja Palana) సమయంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారు మళ్లీ అప్లై చేసుకోనవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రజలు పట్టించుకోవడం లేదు. అప్పుడు తాము సమర్పించిన దరఖాస్తు ఫారాలను అధికారులు ఎక్కడ పడేశారో?.. అసలు వాటిని ఆన్ లైన్(Online) చేస్తున్నారో? లేదో? తెలియదని, మీసేవలో అయితే వెంటనే ఆన్‌లైన్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంతోనే అధికమంది మళ్లీ అప్లై చేసుకోవడానికి మీసేవ కేంద్రాలకు వెళుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఆదేశించినా అధిక ఫీజు

అయితే భారీ రద్దీ కారణంగా పలు చోట్ల టెక్నికల్, సర్వర్ సమస్యలు(Technical & Server Issues) వస్తున్నాయని, దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు కొన్నిచోట్ల ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం రూ.50 మాత్రమే దరఖాస్తు ఫీజు(Application fee)గా తీసుకోవాలని ఆదేశించినా రూ.200కి పైగా వసూల్ చేస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. దీంతో మీసేవ కేంద్రాల వద్ద అధికారులు నిఘా పెట్టారు. నిర్ణీత ఫీజుకంటే ఎక్కువ తీసుకుంటే నోటీసులు జారీ చేస్తున్నారు.