gf

PM Modi: మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 13 కోట్ల రైతులు, గ్రామీణుల లబ్ధి కోసం..

PM Modi: మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 13 కోట్ల రైతులు, గ్రామీణుల లబ్ధి కోసం..

Cabinet Decisions: దేశంలో వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధికి, సహకార రంగంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. దీని కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల (PACS) కంప్యూటరీకరణ జరుగుతుంది. ఇందులోభాగంగా.. ఒక్కో కమిటీకి దాదాపు రూ. 4 లక్షలు వెచ్చించనున్నారు.

ఖర్చును ఎవరు భరిస్తారు.. ఈ మెుత్తం ఖర్చులో 75 శాతం కేంద్రం భరిస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డు భరించాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా ప్రయోజనం కలగనుంది. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,516 కోట్లతో 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు ఇకపై కంప్యూటరీకరణ జరగనుంది.
 


Comment As:

Comment (0)