WhatsApp Image 2024-04-20 at 3

Uppal:నెమలి సురేష్​ను ఆదర్శంగా తీసుకుందాం: పట్నం సునీత

Uppal:నెమలి సురేష్​ను ఆదర్శంగా తీసుకుందాం: పట్నం సునీత

 

Malkajgiri: మాజీ కార్పొరేటర్​ దివంగత నాయకుడు నెమలి సురేష్​ను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్​ కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉందని మల్కాజ్​గిరి కాంగ్రెస్​ పార్లమెంట్​ అభ్యర్థి పట్నం సునీత మహేందర్​రెడ్డి అన్నారు. 

ఉప్పల్​ అసెంబ్లీ పరిధిలోని మల్లాపూర్​ డివిజన్​లో కాలనీ సంక్షేమ సంఘాలతో శనివారం ఆమె సమావేశం అయ్యారు. ఎస్వీ నగర్ కాలనీలో సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు నెమలి అనీల్​ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె హజరై హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలపించాలని కోరారు. 

కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందరు కలిసి కట్టుగా కుటుంబం లాగా పని చేయాలని కోరారు , అనంతరం ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ..5 ఏళ్ళ క్రితం రేవంత్ రెడ్డి  మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎలాగైతే గెలిపించుకున్నామో అలాగే పట్నం సునీతను గెలపించాల్సిన బాధ్యత మనపై ఉందని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో GHMC మాజీ కార్పొరేటర్,మల్లాపూర్ డివిజన్ ఎలక్షన్ ఇంచార్జి సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి  , మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకురాలు,యూత్ కాంగ్రెస్ నాయకులు, SC ST BC మైనార్టీ నాయకులు, సేవదళ్ నాయకులు,NSUI నాయకులు మరియు కార్యకర్తలు, స్థానిక కాలనీ సంఘాల నేతలు , స్థానికులు మరియు యువత ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు


Comment As:

Comment (0)