rains-3-jpg

TS Weather Update: వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.!

TS Weather Update: వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.!

తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

ఇక తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆదివారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అంతేకాదు వడగళ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

ఆదివారంనాడు మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


Comment As:

Comment (0)