Eatala-Rajendar-nominations--jpg

Eatala Rajendar: ఈటల ఆస్తులు ఎతంటే...

Eatala Rajendar: ఈటల ఆస్తులు ఎతంటే...

మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. తనకు మొత్తం రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడావిట్లో పేర్కొన్నారు ఈటల. ఆయన సతీమణి జమునకు 1.5 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆస్తులు, వ్యక్తిగత వివరాలను వెల్లడించారు. తమ కుటుంబానికి 54.01 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు ఈటల. ఇందులో స్థిరాస్తుల విలువ 27.28 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 20.43 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. 

తనపై 54 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు ఈటల. చేతిలో లక్ష నగదు ఉన్నట్లు పొందపరిచారు. భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయన్నారు.

వ్యక్తిగత అడ్వాన్సుల కింద రూ.21.11 కోట్ల అప్పులు ఇచ్చామని అఫిడవిట్‌లో వెల్లడించారు ఈటల రాజేందర్. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి ఉందని.. పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడావిట్లో తనకు రూ.12.50 కోట్ల స్థిరాస్తులు, రూ.16.74 లక్షల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.3.48 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం రూ.53.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఈటల చెప్పారు. అంటే ఈటల ఆస్తుల్లో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా తేడా రాలేదని చెప్పొచ్చు.
 


Comment As:

Comment (0)