Suryapeta

Suryapet:ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు

Suryapet:ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు

Telugu Fast News: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

(Hyderabad)హైదరాబాద్‌లోని జీడిమెట్ల నుంచి సుమారు 30మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు యానాంకు బయలుదేరింది. మార్గమధ్యంలో మునగాల ప్రభుత్వ వైద్యశాల వద్ద అదుపు తప్పి డివైడర్‌ మీదుగా సర్వీస్‌ రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ప్రమాదానికి గురై గాయపడిన నలుగురిని  సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Comment As:

Comment (0)